బెల్లంకొండ గణేష్ “స్వాతిముత్యం” ట్రైలర్ ప్రోమో రిలీజ్

-

బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరో గణేష్. ఇప్పటికే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పుడు ఆయన తమ్ముడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. బెల్లంకొండ గణేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ స్వాతిముత్యం. ఓ అమ్మాయికి మరియు ఓ అబ్బాయికి మధ్య పరిచయం, అది ప్రేమ వైపు సాగే ప్రయాణం, దాని తాలూకు అనుభూతులు అలాగే జరిగే సంఘటనలు ఇవన్నీ స్వాతిముత్యం సినిమాలో చూపించనున్నారు.

ప్రముఖచిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ హీరోయిన్గా నటిస్తోంది. మహతీ స్వర సాగర్ ఈ సినిమాకి బాణీలను అందించాడు. రావు రమేష్, వెన్నెల కిషోర్ ముఖ్యమైన పాత్రలను పోషించారు.

అయితే తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ప్రోమో ను రిలీజ్ చేశారు. గణేష్ బర్త్ డే సందర్భాన్ని పురస్కరించుకొని ఈ వీడియోను వదిలారు. హీరో, హీరోయిన్ లకి సంబంధించిన సన్నివేశాలపైనే ఈ వీడియోను కట్ చేశారు. లవ్ అండ్ కామెడీ టచ్ తో ఈ వీడియోను వదిలారు. త్వరలోనే పూర్తి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version