బ్రిటన్ రాణి అంత్యక్రియలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

-

బ్రిటన్ దివంగత మహారాణి ఎలిజబెత్ 2 అంత్యక్రియలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హాజరుకానున్నారు. భారత్ తరఫున ద్రౌపదీ ముర్ము రాణికి నివాళులు అర్పిస్తారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ద్రౌపదీ ముర్ముకు ఇదే తొలి విదేశీ పర్యటన కానుంది. ఈనెల 17 నుంచి 19 వరకు ద్రౌపదీ ముర్ము లండన్​లో పర్యటించనున్నారు.

బ్రిటన్‌ను అత్యధిక కాలం పరిపాలించిన రాణి ఎలిజబెత్‌-2 (96) ఈనెల 8న స్కాట్‌లాండ్‌లోని బల్మోరల్‌ క్యాజిల్‌లో కన్నుమూశారు. బ్రిటన్‌కు ఆమె ఏకంగా 70 ఏళ్లపాటు మహారాణిగా వ్యవహరించారు. ఎలిజబెత్ 2 మరణం పట్ల రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాన మంత్రి విచారం వ్యక్తం చేశారు. దిల్లీలోని బ్రిటీష్ రాయబార కార్యాలయానికి వెళ్లిన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్.. భారత్ తరఫున సంతాపం తెలియజేశారు. క్వీన్ ఎలిజబెత్ 2 మరణానికి సంఘీభావం తెలుపుతూ భారత్​లో ఈనెల 11న సంతాప దినంగా పాటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version