గాంధీ జయంతి ఈ నెల 2న 151వ జయంతి వేడుకలు జరిగిన విషయం తెలిసిందే. యావత్ దేశం మొత్తం ఆ మహత్ముడు చేసిన త్యాగాలని కొనియాడింది. అహింసా మార్గంలో ఇండియాకు స్వాతంత్య్రాన్ని తెచ్చిపెట్టిన జాతిపితపై ప్రశంసలు కురిపించారు. టాలీవుడ్ తారలు కూడా సోషల్ మీడియా వేదికగా తమ వ్యూస్‌ని వ్యక్తపరిచారు. అలనాటి సంగతుల్ని గుర్తు చేసుకున్నారు.

యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కూడా గాంధీపై తనకున్న అభిప్రాయలని వ్యక్తం చేశారు. చిన్న తనం నుంచి గాంధీలా నటించాలని కోరిక వుండేదట. స్కూల్ డేస్‌లో తను గాంధీ గెటప్ వేసుకుని కనిపించాడట. ఆ ఫొటోని గాంధీ జయంతి సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. `మీరు చనిపోయి వుండొచ్చు కానీ మా గుండెల్లో శాశ్వతంగా జీవించే వుంటారు` అని బెల్లంకొండ శ్రీనివాస్ ట్వీట్ చేశారు.