తులసి విత్తనాలతో ఎన్నో ప్రయోజనాలు!

-

భారతీయ మహిళలు తులసి చెట్టును దైవంగా భావిస్తారు. వాటికి విత్తనాలు ఎక్కువగా వచ్చినప్పుడు వాటిని తుంచి పడేస్తుంటారు. తులసి ఆకులకు మాత్రం పసుపు, కుంకుమ పెట్టి పూజ చేస్తారు. అంతేకాకుండా ఆరోగ్యంగా ఉండేందుకు తులసి ఆకులను తింటుంటారు. ఆకులే కాకుండా వాటి విత్తనాలతో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలసుకోండి.

– తులసి విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. క్యాన్సర్ కణాలు పెరుగకుండా చూస్తాయి. శరీరంలో కణజాలాన్ని నాశనం చేసే ఫ్రీ ర్యాడికల్స్‌ను ఈ యాంటీ ఆక్సిడెంట్లు అడ్డుకుంటాయి.
– తులసి విత్తనాల్లో ఉండే ఫైబర్ జీర్ణసమస్యలను, అధిక బరువును తగ్గిస్తుంది.
– రక్తనాళాల్లో కొవ్వు ఎక్కువగా పేరుకుపోయిన వారు రోజూ తులసి విత్తనాలను తింటే మంచి ఫలితం ఉంటుంది.
– తులసి విత్తనాల్లో యంటా ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోదక శక్తిని పెంచుతాయి. దీంతోపాటు క్యాన్సర కణాలు పెరుగకుండా చూస్తాయి. శరీరంలో కణజాలాన్ని నాశనం చేసే ఫ్రీ ర్యాడికల్స్‌ను ఈ యాంటీ ఆక్సిడెంట్లు అడ్డుకుంటాయి.
– నిత్యం తులసి విత్తనాలను తినడం వల్ల హార్ట్ ఎటాక్‌లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇందులో ఉండే పొటాషియం గుండెజబ్బులు రాకుండా చూస్తుంది.
– వయసు మీద పడడం కారణంగా చర్మంపై వచ్చే ముడుతలు తగ్గాలంటే నిత్యం తులసి విత్తనాలను తినాలి.
– తులసి విత్తనాల్లో ఉండే విటమిన్ కంటి సమస్యలను పోగొడుతుంది. అలాగే కంటిచూపును మెరుగుపరుస్తుంది.
– తులసిలో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను పోగొడుతుంది. దాంతో వెంట్రుకలు రాలకుండా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version