తల్లి పాలు శిశువుకి ఇవ్వడం వల్ల ఇద్దరికీ మంచిదేనా..?

-

ప్రకృతి సృష్టించిన ఈ నియమం ద్వారా కేవలం శిశువుకు కాదు. పాలు ఇచ్చే తల్లికి కూడా ఆరోగ్యంలో కూడా గణనీయమైన మార్పులు ఉంటాయి. తల్లి తప్పని సరిగా తన శిశువు కి కనీసం 6-8 నెలలు పాలని ఇవ్వాలి. అయితే పాలు ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అనే విషయం గురించి.. అలానే ఎలాంటి మార్పులు ఉంటాయో ఇప్పుడే తెలుసుకోండి.

తల్లి పిల్లలకి పాలు ఇస్తే ఆ శిశువుకి చాల మంచి కలుగుతుంది ఎందుకంటే తల్లి పాలలో టాక్సిన్స్‌తో పోరాడే శక్తి ఉంటుంది. కనుక శిశివు తల్లి పాలని తాగితే జలుబు, సైనస్, చెవి ఇన్ఫెక్షన్స్, విరేచనాలు, మలబద్ధకం వంటి సమస్యలు శిశువుకి చేరవు. చూసారా ఎన్ని సమస్యల నుండి శిశువు బయట పడొచ్చు. అయితే కేవలం శిశువుకు కాదు తల్లికి కూడా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ విషయం చాల మందికి తెలియదు.

తల్లికి కలిగే ప్రయోజనాల లోకి వస్తే… తల్లి పాలివ్వడం తల్లి శరీరానికి అవసరమైన రక్తాన్ని పునరుద్ధరిస్తుంది. తల్లి పాలు సమయంలో ప్రోలాక్టిన్ వంటి హార్మోన్లు విడుదలవుతాయి. ఈ కారణంగా గర్భాశయం యొక్క ఆరోగ్యాన్ని మెరుగు పరచడానికి కూడా సహాయ పడుతుంది. అంతే కాదండి గుండె సమస్య, రొమ్ము మరియు అండాశయ క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడుతుంది. తల్లి పాలివ్వడం వల్ల శిశువుకు సరైన మొత్తం లో కాల్షియం లభిస్తుంది. తల్లి పాలు శిశువు కంటి చూపు మెరుగు పరుస్తుంది కూడా.

Read more RELATED
Recommended to you

Exit mobile version