ఈ LIC పాలసీతో అదిరే ప్రయోజనాలు..!

-

దేశీ దిగ్గజ బీమా రంగ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC ఎన్నో రకాల బెనిఫిట్స్ ని అందిస్తోంది. వీటితో కస్టమర్స్ కి రక్షతో పాటుగా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఎలైసి వివిధ పాలసీలు అందించగా.. వాటిలో మైక్రో పాలసీలు కూడా ఉన్నాయి. మైక్రో పాలసీ అంటే బాగా గుర్తొచ్చేది మైక్రో బచత్ ప్లాన్‌. ఈ ప్లాన్ గురించి పూర్తి వివరాలలోకి వెళితే..

మైక్రో బచత్ ప్లాన్‌ను తీసుకుంటే అదిరిపోయే లాభాల్ని పొందొచ్చు. ఈ పాలసీ తీసుకోవడం వల్ల రక్షణ, పొదుపు కూడా ఉంటుంది. ఈ మైక్రో బచత్ పాలసీని రూ.50 వేల నుంచి రూ.2 లక్షల బీమా మొత్తానికి తీసుకోవచ్చు. ఇది నాన్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ.

ఇక ఎవరు అర్హులు అనేది చూస్తే.. 18 నుంచి 55 ఏళ్ల వయసు కలిగిన వారు ఈ పాలసీ తీసుకో వచ్చు. మూడేళ్లు ప్రీమియం చెల్లిస్తే లోన్ ఫెసిలిటీ కూడా పొందొచ్చు. నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది చొప్పున పాలసీ ప్రీమియం చెల్లించవచ్చు. 10 నుంచి 15 ఏళ్ల టైం లిమిట్ తో తీసుకోవచ్చు. 35 ఏళ్ల వయసులో వున్న వ్యక్తి 15 ఏళ్ల కాల పరిమితితో రూ.2 లక్షల బీమా మొత్తానికి ఈ పాలసీ తీసుకుంటే ఏడాదికి రూ.10,300 ప్రీమియం అంటే రూ.28 పొదుపు చేస్తే చాలు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version