వేసవిలో ఖర్బూజా తీసుకోవడం వలన ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

-

ఇప్పుడు ఇక ఎండలు విపరీతంగా ఉంటాయి. పైగా తట్టుకోలేనంత వేడి, పదేపదే డిహైడ్రేషన్ కి గురవడం ఇలా అనేక సమస్యలు ఉంటాయి. ఇటువంటి సమయం లో ఆ కాలం లో దొరికే పండ్లను, కూరగాయలను తీసుకోవడం చాలా ముఖ్యం.

పండ్ల వల్ల కేవలం బాడీ హైడ్రేట్ అవడం మాత్రమే కాదు ఇమ్యూనిటీని కూడా పెంపొందించుకోవడానికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా చెప్పాలంటే అన్ని పండ్లు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఈ సమయంలో కర్బూజ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.

దీని వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం..! కర్బూజా లో ఫాలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది బ్లడ్ క్లాట్ అవ్వకుండా సహాయపడుతుంది. అలాగే వేసవి కాలంలో హీట్ స్ట్రోక్ ఎక్కువగా వస్తుంది. కర్బూజ తీసుకోవడం వల్ల హీట్ స్ట్రోక్ రాకుండా ఉంటుంది.

అలానే వేసవి కాలం లో డీప్ ఫ్రై చేసినవి రోస్ట్ చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి. దీని వల్ల కాన్స్టిపేషన్ కి గురి అయ్యే అవకాశం ఉంది. అయితే మీరు కనుక ఫైబర్ ఎక్కువగా కలిగిన ఈ కర్బూజాని తీసుకుంటే కాన్స్టిపేషన్ కూడా మీకు రాదు.

విటమిన్ సి కూడా కర్బూజ ఎక్కువగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీనిని మీ డైట్ లో చేర్చడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు. పైగా ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండడానికి కూడా ఇది సహాయపడుతుంది. దీనిలో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. ఇది ముసలితనాన్ని త్వరగా రాకుండా ఉంచుతుంది. స్టమక్ అల్సర్స్ కూడా దీని వల్ల కలగవు.

ఖర్బూజా లో బీటాకెరోటిన్ ఉంది. ఇది కంటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అని నిపుణులు చెబుతున్నారు. అలానే కర్బూజా లో సోడియం మరియు పొటాషియం ఉంటుంది ఇది ఎలక్ట్రోలైట్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. కిడ్నీలో రాళ్లు సమస్యలు కూడా ఇది తొలగిస్తుంది. దీనిలో అధిక శాతం నీరు ఉంటుంది కాబట్టి ఆ సమస్య కూడా తొలగిపోతుంది .

అలానే గుండె సంబంధిత సమస్యలు కూడా ఇది తరిమికొడుతుంది. ప్రతి రోజు ఒక మనిషి 250 నుంచి 300 గ్రాములు ఖర్బూజా ని తీసుకోవచ్చు అని డాక్టర్లు చెబుతున్నారు. డయాబెటిస్ పేషంట్స్ ఐతే 100 నుంచి 150 గ్రాములు మాత్రమే తీసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version