బొప్పాయి వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే…!

-

బొప్పాయి లో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. దీనిని తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ ఇందులో పుష్కలంగా ఉంటాయి. హృదయ ఆరోగ్యాన్ని ఇది పెంపొందిస్తుంది. బొప్పాయి లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది మరియు కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. అంతే కాదండి బొప్పాయి వల్ల ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయి. వాటి కోసం ఇప్పుడే పూర్తిగా తెలుసుకోండి.

మామిడి పండు తర్వాత బొప్పాయి లోనే మనకు అధిక పరిమాణం లో విటమిన్ ఏ లభిస్తుంది దీనితో పాటు బి1, బి2, బి3 కూడా ఉంటాయి. క్యాల్షియం, ఇనుము, భాస్వరం వంటి ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి. కంటికి సంబంధించిన రోగాలు రాకుండా బొప్పాయి సహాయ పడుతుంది. దంతాల చిగుళ్ళ ఆరోగ్యానికి, రక్త వృద్ధికి, రోగ నిరోధక శక్తికి ఇందులో ఉండే విటమిన్ సి తోడ్పడుతుంది. ఆస్తమా, కీళ్ల వ్యాధుల వంటివి రాకుండా నిరోధిస్తుంది.

బొప్పాయి ‘కాయ’ జీర్ణానికి తోడ్పడితే… ‘పండు’ పోషకాలనిస్తుంది. బొప్పాయి పండును చిన్న పిల్లలకు గుజ్జుగా చేసి నాలుగో నెల నుంచి తినిపించవచ్చు. కేవలం ఆరోగ్యానికే కాదు అందానికి కూడా బాగా ఉపయోగ పడుతుంది. బొప్పాయి తో ఫేస్ ప్యాక్ వేసుకుంటే ఆయిల్ స్కిన్ వాళ్ళకి బాగా బెనిఫిట్ ఉంటుంది. చూసారా దీని వల్ల ఎన్ని లాభాలో…! మరి దీనిని మీ డైట్ లో చేర్చండి. ఆరోగ్యంగా ఉండండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version