జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో నెమలి ఈకలను ఉంచుకుంటే ఏం ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకోండి..!

-

హిందూ సాంప్రదాయంలో నెమలి ఈకలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. శ్రీకృష్ణుడు, సరస్వతీ దేవిలకు నెమలి ఫించాలు అంటే ఎంతో ఇష్టం. అలాగే లక్ష్మీదేవి, ఇంద్రుడు, కార్తీకేయుడు, వినాయకుడు ఇలా ఇంకొందరు దేవతలు, దేవుళ్లకు కూడా నెమలి ఫించాలు అంటే ప్రీతి. అందువల్లే వీటికి హిందూ సాంప్రదాయంలో అంతటి ప్రాముఖ్యత ఏర్పడింది.

కొందరు ఇళ్లను అలంకరించుకునేందుకు నెమలి ఫించాలను ఉపయోగిస్తుంటారు. కొందరు వీటిని పుస్తకాల్లో పెట్టుకుంటారు. దీంతో చదువుల్లో రాణించవచ్చని, అదృష్టం కలసి వస్తుందని భావిస్తారు. అయితే నెమలి ఈకలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల కష్టాల నుంచి బయట పడవచ్చు. ఇవి శుభాలను కలిగిస్తాయి.

* నెమలి ఈకలను 8 తీసుకుని వాటిని తెల్లని దారంతో కింది వైపున ముడి వేయాలి. తరువాత ఓం సోమాయ నమః మంత్రాన్ని జపించాలి. దీంతో ఇంట్లో ఉండే వాస్తు దోషాలు పోతాయి.

* 3 నెమలి ఈకలను తీసుకుని నల్లని దారంతో కింది వైపుకు ముడి వేయాలి. అనంతరం కొన్ని వక్కలను చేతిలో ఉంచుకుని ఓమ్‌ శనైశ్చరాయ నమః మంత్రాన్ని 21 సార్లు జపించాలి. జపించినప్పుడల్లా కొంత నీటిని చల్లాలి. దీంతో శని దోషం తొలగిపోతుంది.

* లాకర్‌ సమీపంలో నెమలి ఈకలను ఉంచడం వల్ల ధనం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.

*ఇంట్లో లివింగ్‌ రూమ్‌లో నెమలి ఫించాలను ఉంచడం వల్ల సంతోషం నెలకొంటుంది. దుఃఖం ఉండదు.

* ఇంటి ద్వారం వద్ద నెమలి ఈకలను ఉంచితే ఇంట్లోకి నెగెటివ్‌ శక్తి రాదు. వాస్తు దోషాలు కూడా పోతాయి.

* నెమలి ఈకలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఇంట్లో అందరి ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి.

* విద్యార్థులు నెమలి ఈకలను పుస్తకాల్లో ఉంచుకోవడం వల్ల చదువుల్లో రాణిస్తారు.

* బెడ్‌రూంలో నెమలి ఈకలను ఉంచితే దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కలహాలు ఉండవు.

Read more RELATED
Recommended to you

Exit mobile version