తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం బతకాలి అంటే కచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ రావాలి అనేది కొంతమంది చెప్తున్న మాట. ఇటీవల చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకు వెళ్లిన సందర్భంగా అక్కడున్న కొంతమంది ఈ వ్యాఖ్యలు దీంతో చంద్రబాబు నాయుడు కాస్త ఇబ్బంది పడ్డారు అంటూ సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం జరిగింది.
ఇది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ తో సమావేశమైనట్టుగా మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల హైదరాబాద్ వెళ్ళిన ఒక ఎమ్మెల్యే ఆయనతో సమావేశం అయ్యారు అని భోగట్టా. పలు కీలక అంశాలు జూనియర్ ఎన్టీఆర్ తో చర్చించారని మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.
అయితే ఏం చర్చించారు ఏంటనేది తెలియకపోయినా కొంత మంది సన్నిహితులు మాత్రం ఆయన ఇంట్లో జరిగే శుభకార్యానికి జూనియర్ ఎన్టీఆర్ ని ఆహ్వానించారని అంటున్నారు. మరికొంతమంది మాత్రం రాజకీయ వ్యవహారాలు జూనియర్ ఎన్టీఆర్ తో చర్చించినట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా స్పష్టత రాలేదు. అయితే జూనియర్ ఎన్టీఆర్ శుభకార్యానికి వెళ్తారా లేదా అనేది కూడా ఆసక్తికరంగానే ఉంది. తెలుగుదేశం పార్టీ నేతల శుభకార్యాలకు జూనియర్ ఎన్టీఆర్ వెళ్లడం మానేశారు. ఈ తరుణంలో ఎమ్మెల్యే వెళ్లి జూనియర్ ఎన్టీఆర్ ని కలవడంతో టిడిపి వర్గాలు కూడా కాస్త ఆసక్తికరంగా చూస్తున్నాయి. మరి ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనేది కొంతకాలం ఆగితే గాని తెలియదు.