నిద్రలేమితో సతమతమవుతున్నారా.. అయితే ఇవి తినండి..!?

-

నేటి సమాజంలో చాల మంది స్మార్ట్ ఫోన్, టీవీలు చూస్తూ ఆలస్యంగా నిద్రపోతుంటారు. దీంతో చాలామందిలో నిద్రలేమి సమస్య తలెత్తుతుంది. దీంతో నిద్రలేమి కారణంగా చాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే మనం తీసుకునే ఆహారం కూడా మన నిద్రపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి హాయిగా నిద్రపోవాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఒక్కసారి చూద్దామా.

Food-For-Sleep

ఇక కంటి నిండా నిద్రపోవాలంటే ఓట్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే విటమిన్స్‌, మినరల్స్‌, అమినో యాసిడ్స్‌, మెలటోనిన్‌ మొదడును ప్రశాంతంగా ఉంచి నిద్రాభంగం కలగకుండా చూసుకుంటాయి. ఇక రాత్రి పడుకునే ముందు బాదం తింటే హాయిగా నిద్రపడుతుందట. ఇందులో ఉండే మెగ్నీషియం నిద్ర పట్టేలా చేస్తుంది. నిద్రను ప్రభావితం చేసే ఆహార పదార్ధాల్లో అరటి ఒకటి. ఇందులో పుష్కలంగా లభించే మెగ్నీషియం, మెలటోనిస్‌ నిద్రకు ఉపక్రమించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

అంతేకాదు.. మెదడుపై ప్రభావం చూపే ఆహార పదార్థాల్లో వాల్‌ నట్స్‌ ఒకటి. ఇందులో ఉండే మెలటోనిన్‌ హాయిగా నిద్ర పట్టడానికి దోహదపడతాయి. చెర్రీస్‌ కూడా నిద్ర బాగా పట్టడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రాత్రి పడుకునే ముందు చెర్రీలను తింటే నిద్రాభంగం లేకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గుడ్డు ఆరోగ్యానికి మేలు చేస్తుందని మనందరికీ తెలిసిందే. అయితే ఇందులో ఉండే అమైనో యాసిడ్స్‌ నిద్రపట్టేందుకు ఉపయోగపడతాయి. రాత్రి పడుకునే ముందు ఓ గ్లాసు పాలు తాగితే మంచి నిద్ర మీ సొంతమవుతుందని నిపుణులు చెబుతున్నారు. పాలలో ఉండే ఎన్నో పోషకాలు ఆరోగ్యంతో నిద్రకు మేలు చేస్తుంది.

అయితే నిద్రకు ఉపక్రమించే ఆహార పదార్థాల గురించి తెలుసుకున్నాం. మరి నిద్రకు ఉపక్రమించే ఎలాంటి ఆహార పదర్థాలు తీసుకోకూడదంటే.. నిద్రపోయే ముందు ముఖ్యంగా త్వరగా జీర్ణం కానీ ఆహార పదార్థాలను తీసుకోకూడదు. దీనివల్ల జీర్ణ వ్యవస్థలో ఇబ్బందులు ఎదురుకావడంతో రాత్రుళ్లు మేల్కోవాల్సి వస్తుంది. అలాగే.. రాత్రి నిద్రించే ముందు కూల్‌ డ్రింక్స్‌, ఆల్కహాల్‌ తీసుకోకూడదు ఇవి కూడా నిద్రకు భంగం కలిగిస్తాయి. ఇక రాత్రుళ్లు టీ, కాఫీ లాంటి వాటికి దూరంగా ఉంటే మేలని నిపుణులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version