ఆరోగ్య లక్షణాలు అధికంగా ఉన్న “గోధుమ గడ్డి” లాభాలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..

-

ఆరోగ్యకరమైన ఆహారాన్ని గురించి ఆలోచిస్తుంటే అందులో గోధుమ గడ్డి తప్పక చేర్చుకోండి. దీనిలోని పోషకాలు శరీరానికి చాలా మేలు చేస్తాయి. దీన్ని పానీయంమ్గానూ, ఆహారంగానూ తీసుకుంటారు. ఈ గోధుమ గడ్డి వల్ల కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

గోధుమ గడ్డిలో ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫైటోన్యూట్రియెంట్స్, అమైనో ఆమ్లాలు, విటమిన్లు ఎ, సి, ఇ, కె, బి కాంప్లెక్స్, క్లోరోఫిల్ ఇంకా ప్రోటీన్ వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి.

చల్లదనానికి

శరీరంలో వేడిని తగ్గించుకునేందుకు గోధుమ గడ్డిని తీసుకోవడం చాలా మంచిది. అందుకోసం వేసవి కాలంలో గోధుమ గడ్డిని ఆహారంగా తీసుకోవడానికి ఇష్టపడతారు. ఐతే ఏదైనా అతిగా తీసుకోవడం అనర్థం అన్న సంగతి మర్చిపోవద్దు.

చర్మానికి

చర్మంపై అక్కడక్కడా ముఖ్యంగా ముఖంపై పేరుకుపోయిన నలుపు భాగాలని ఇది తొలగిస్తుంది. గోధుమ గడ్డి పౌడర్ ను తీసుకుని దానికి కొంత నీరు కలిపి ఎక్కడైతే నలుపు భాగాలు ఉన్నాయో అక్కడ వర్తింపజేయండి. పది నిమిషాల తర్వాత నీటితో కడిగేయండి. తరచుగా ఇలా చేస్తుండడం వల్ల ముఖంపై నలుపు భాగాలు తొలగిపోతాయి.

బరువు తగ్గడానికి

ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. దీనివల్ల శరీరంలో ఎక్కువగా కొవ్వు నిల్వ ఉండకుండా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు తమ డైట్ లో దీన్ని చేర్చుకోవచ్చు.

మలబద్దకం నివారించడానికి

ఇందులో ఫైబర్ తో పాటు మెగ్నీషియం ఉంటుందని ముందే చెప్పుకున్నాం. ఈ మెగ్నీషియం కారణంగా జీవక్రియ పనితీరు మెరుగవుతుంది. దానివల్ల మలబద్దకం సమస్య దూరమవుతుంది. అంతేకాదు ఇందులోని ఆల్కలీన్ ఖనిజాలు విరోచనాల నుండి ఉపశమనం అందిస్తాయి.

కీళ్ళ నొప్పులని తగ్గిస్తుంది

వాతావరణంలో మార్పుల వల్ల తరచుగా కీళ్ళనొప్పుల సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి పరిస్థితి ఎదురైనపుడు గోధుమ గడ్డి రసాన్ని తాగడం వల్ల కీళ్లనొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version