చాలా మంది బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటూ వుంటారు. డబ్బులని ఫిక్సెడ్ డిపాజిట్ కూడా చేస్తూ వుంటారు. మీరు కూడా బ్యాంకులో డబ్బులని FD చేస్తుంటారా..? అయితే మీరు తప్పకుండ ఇది చూడాలి. బ్యాంకులలో ఫిక్స్‌డ్ డిపాజిట్ ఓపెన్ చేయాలనుకునే వాళ్లకి గుడ్ న్యూస్.
ఎందుకంటే బ్యాంక్‌లో డబ్బులు దాచుకుంటే పలు ప్రయోజనాలు పొందొచ్చు. పన్ను ఆదా దగ్గరి నుంచి ఇన్సూరెన్స్, రాబడి ఇలా చాలా లాభాలను బ్యాంక్ ఖాతాదారులు పొందొచ్చు. పైగా ఈ డబ్బులు సురక్షితంగా ఉంటాయి. ఏ రిస్క్ కూడా ఉండదు. అయితే మరి ఇక ఇప్పుడు ఏ ఆలస్యం లేకుండా ఎఫ్‌డీ చేయడం ద్వారా వచ్చే లాభాలను చూద్దాం.
బ్యాంకులో డబ్బులని ఎఫ్డీ చేస్తే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనం కూడా పొందొచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, డీసీబీ బ్యాంక్ వంటివి ఇన్సూరెన్స్ ప్రయోజనం కల్పిస్తాయి.
అలానే క్రెడిట్ కార్డు పొందొచ్చు. మీరు డిపాజిట్ చేసిన మొత్తంలో 80 – 85 శాతం వరకు మొత్తంతో క్రెడిట్ కార్డు లభిస్తుంది.
రూ.5 లక్షలకు గ్యారంటీ. ఫిక్స్‌డ్ డిపాజిట్లను సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ సాధనంగా చూస్తారు. ఒకవేళ బ్యాంక్ దివాలా తీస్తే కేంద్ర ప్రభుత్వం మీకు రూ. 5 లక్షల వరకు అందిస్తుంది. అంటే మీరు బ్యాంక్‌లో రూ.5 లక్షల వరకు ఎఫ్‌డీ చేస్తే ఏ సమస్య ఉండదు.
ఒకవేళ మీకు ఏదైనా అవసరం వస్తే మధ్య లో డబ్బులు తీసేయచ్చు. మెచ్యూరిటీ కన్నా ముందే ఎఫ్‌డీ నుంచి డబ్బులు తీసుకోవచ్చు. అయితే ఇక్కడ బ్యాంకులు కొంత మేర చార్జీలు వసూలు చెయ్యడం జరుగుతుంది.
అదే విధంగా పన్ను మినహాయింపు ప్రయోజనాలు పొందొచ్చు. ఐదేళ్లు లేదా ఆపైన కాల పరిమితిలోని ఎఫ్‌డీలకు మాత్రమే పన్ను మినహాయింపు ఉంటుంది.
ఫిక్స్‌డ్ డిపాజిట్ల ద్వారా కచ్చితమైన రాబడి లభిస్తుంది. మీరు ఇన్వెస్ట్ చేయడానికి ముందుగానే మీకు ఎంత రాబడి వస్తుందో తెలుసుకోచ్చు కూడా.
మీరు బ్యాంక్‌లో ఎఫ్‌డీ చేస్తే.. రుణ సదుపాయం ఉంటుంది. మీరు పెట్టిన డబ్బుల్లో 90 శాతం వరకు మొత్తాన్ని తిరిగి లోన్ కింద పొందొచ్చు.