టిక్ టాక్ చేస్తున్న పోలీసులు…!

-

యూత్ లో బాగా క్రేజ్ వచ్చిన సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ టిక్ టాక్. ప్రస్తుతం ఈ యాప్ సోషల్ మీడియాను ఊపేస్తుంది. చాలా వరకు అమ్మాయిలూ, అబ్బాయిలు, అందరూ కూడా ఈ యాప్ పై మక్కువ చూపిస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకే బెంగళూరు పోలీసులు కూడా చేరారు. యువతకు కనెక్ట్ అయ్యేందుకు గాను బెంగళూరు సిటీ పోలీసులు టిక్ టాక్ లో జాయిన్ అయ్యారు.

“మేము టిక్‌టాక్‌లో ఉన్నా౦. ఎందుకంటే ఇది చాలా ప్రజాదరణ పొందిన వేదిక. మరియు ఇది యువతతో బాగా కలుపుతుంది. మేము అవగాహన వీడియోలను తయారు చేస్తాం. అదే విధంగా హాస్యం కూడా జత చేస్తాం. మా బెంగళూరు పోలీసుల ట్విట్టర్ ప్రొఫైల్ కూడా వైరల్ అయ్యింది. అదే విధంగా టిక్‌టాక్ పోలీసులకు సహాయం చేస్తుందని భావిస్తున్నామని డిసిపి సౌత్ ఈస్ట్ బెంగళూరు ఇషా పంత్ అన్నారు.

అప్పుడే బెంగళూరు సిటీ పోలీసులు వీడియోలను అప్‌లోడ్ చేయడం కూడా మొదలుపెట్టి 25 వేల మంది ఫాలోవర్స్ ని కూడా పొందారు. ఫేస్‌బుక్ వినియోగదారుడు ఒకరు టిక్ టాక్ ఇండియా ప్రతినిధులతో అపాయింట్‌మెంట్ కోసం బెంగళూరు కమిషనర్‌ను కోరడంతో… కమిషనర్ భాస్కర్ రావు వెంటనే అపాయింట్‌మెంట్ ఇచ్చి టిక్‌టాక్ ప్రతినిధులతో సమావేశమైన వారం తర్వాత ఈ ప్రొఫైల్ క్రియేట్ చేసారు.

https://www.tiktok.com/@blrcitypolice/video/6787019745385303298

Read more RELATED
Recommended to you

Exit mobile version