కరోనా వలన కూతురికి తల్లి హగ్ ఎలా ఇచ్చిందో చూడండి…!

-

చైనాలో కరోనా వైరస్ తీవ్రత చాలా అధికంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ తీవ్రత క్రమంగా పెరిగిపోతుంది. ఇప్పటి వరకు దాదాపు 700 మంది వరకు ఈ వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 30 వేల మందికి పైగా ఈ వైరస్ సోకినట్టు తెలుస్తుంది. ఇక మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు. ఇదిలా ఉంటే ఇప్పుడు కరోనా వలన చైనాలో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి.

అమ్మలను పిల్లలు కూడా కలవలేని పరిస్థితుల్లో ఉన్నారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో ఒకటి విస్తృతంగా వైరల్ అవుతుంది. న్యూ చైనా టీవీ షేర్ చేసిన ఈ వీడియోలో కరోనావైరస్ రోగులకు చికిత్స చేస్తున్న ఒక నర్సు తన కుమార్తెను గాలి కౌగిలితో ఓదార్చడం ఈ వీడియోలో ఉంటుంది. దీనితో తల్లికి కూతురికి ప్రత్యక్ష స్పర్శ అనేది లేకుండా పోయింది. ఆమె కళ్ళలో కన్నీళ్ళు రావడం వీడియోలో ఉంటుంది.

అమ్మ రాక్షసులతో పోరాడుతోంది. వైరస్ ఆగిపోయిన తర్వాత తర్వాత నేను ఇంటికి తిరిగి వస్తాను” అని నర్సు తన కూతురికి వివరిస్తుంది. అప్పుడే తల్లీ కూతురు ఇద్దరూ చేతలు చాచి గాల్లోనే హగ్ చేసుకుంటారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. అక్కడి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ఈ వీడియో స్పష్టంగా చెప్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version