ఇంట్లో ఉంటూనే.. లాభసాటి వ్యాపారాలు ఇవే…! పెట్టుబడి తక్కువ కూడా…!

-

ఈ రోజుల్లో ఆలోచన ఉండాలే గాని ఉపాధికి కొదవ లేదు… మనం సరిగా ఆలోచిస్తే ఆదాయం కూడా సరిగానే ఉంటుంది… ఏ వ్యాపారం చేస్తున్నాం దాని మీద మనకు పట్టు ఎంత అనేది ఆలోచించుకుంటే చాలు… అవసరానికి తగిన విధంగా ఉత్పత్తులను అందుబాటులో ఉంచి వాటిని డిమాండ్ వైపు మళ్లిస్తే వ్యాపారం ఎక్కువగా వృద్ది చెందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోనే బ్రతకాలి అనేది చాలా మంది ఆలోచన… అక్కడే సెటిల్ అవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటారు… ఒకప్పుడు నగరాల మీద ఉండే క్రేజ్ ఇప్పుడు లేదు…

గ్రామాల్లో ఉండాలి ఆనుకున్న వాళ్ళు… ఆదాయం మీద కూడా దృష్టి పెట్టి… కాస్త రిస్క్ ఉండే వ్యాపారాలు కూడా చేస్తున్నారు. అసలు గ్రామాల్లో తక్కువ పెట్టుబడి వ్యాపారాలు ఏంటి అనేది చూద్దాం…

ఫ్యాషన్ రంగం: ఈ రోజుల్లో మాస్ ఎక్కువగా దీనికి ఆసక్తి చూపిస్తున్నారు. రెండు మూడు గ్రామాలకు మీ ఊరు సెంటర్ అయితే మాత్రం… హోల్ సేల్ ధరలకు రాజస్థానీ, తమిళనాడు వాళ్ళ దగ్గర… దుస్తులు, రోల్డ్ గోల్డ్ ఆభరణాలు వంటివి కొనుగోలు చేసి… మంచి లాభానికి విక్రయించవచ్చు…

నెయ్యి: నగరాల్లో నెయ్యి డిమాండ్ పెరుగుతుంది… మీరు గనుక పాల వ్యాపారంలో ఉన్నట్లు అయితే నెయ్యి అమ్మకం అనేది లాభసాటి వ్యాపారం… ఇప్పుడు స్వచ్చమైన నెయ్యి కావాలి అంటే 800 వరకు కూడా ఖర్చు చేస్తున్నారు. కాబట్టి దీని మీద దృష్టి పెట్టవచ్చు…

కిరాణా షాప్స్: బహుసా గ్రామాల్లో దీన్ని మించిన వ్యాపారం లేదు… మీ ఇల్లు గడవడమే కాకుండా… కొంత నగదుని రోజు వారీగా మీరు ఆదా చేసుకునే సదుపాయం ఇక్కడ ఉంటుంది… కాబట్టి కష్టపడగలం అనే నమ్మకం ఉంటె మొదలుపెట్టొచ్చు…

పశుగ్రాసం: దీనికి కూడా క్రమంగా గ్రామాల్లో డిమాండ్ పెరుగుతుంది. పశువుల సంఖ్య తగ్గడానికి పశుగ్రాసం కొరత అనేది ప్రధాన కారణం… దీనితో మీకు పొలం ఉంటె మాత్రం… పశుగ్రాసం వ్యాపారం చేయవచ్చు…

టైలరింగ్: ఈ రోజుల్లో గ్రామాల్లో కూడా ఫ్యాషన్ అనేది ఎక్కువగా పెరిగిపోయింది. దీనితో బ్లౌసులు, చిన్న పిల్లలకు మోడల్ దుస్తులు అనేవి డిమాండ్ ఉన్నవి… గ్రామాల్లో వీటికి మంచి డిమాండ్ ఉంది… ఈ తరుణంలో నగరాల మీద మొగ్గు చూపుతున్నారు… మీరు గనుక నైపుణ్యం ఉన్న టైలర్ ని పెడితే ఇది మంచి వ్యాపారం…

Read more RELATED
Recommended to you

Exit mobile version