మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఉత్త‌మ ప‌ల్స్ ఆక్సిమీట‌ర్లు ఇవే..!

-

కరోనా నేప‌థ్యంలో ప్ర‌స్తుతం చాలా మంది ఆక్సిమీటర్ల‌ను ఉప‌యోగిస్తున్నారు. కోవిడ్ వ‌చ్చిన వారు ఇంట్లో ఉండి చికిత్స తీసుకుంటూ ఎప్ప‌టిక‌ప్పుడు ఈ మీట‌ర్ల ద్వారా త‌మ త‌మ ఆక్సిజ‌న్ లెవ‌ల్స్‌ను ప‌రీక్షించుకుంటున్నారు. ఇక కోవిడ్ రాని వారు కూడా భ‌యం కొద్దీ వీటిని కొనుగోలు చేసి ఆక్సిజ‌న్ లెవ‌ల్స్‌ను చెక్ చేసుకుంటున్నారు. అయితే మార్కెట్ లో ఈ మీట‌ర్ల‌కు ఉన్న డిమాండ్ కార‌ణంగా న‌కిలీలు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే నాణ్య‌మైన ఆక్సిమీట‌ర్ల‌ను వాడాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. అందులో భాగంగానే మార్కెట్‌లో అందుబాటులో ఉన్న బెస్ట్ ప‌ల్స్ ఆక్సిమీట‌ర్ల వివ‌రాల‌ను ఇక్క‌డ అంద‌జేస్తున్నాం. వాటి గురించి తెలుసుకోండి. నాణ్య‌మైన ఆక్సిమీట‌ర్ల‌నే కొనుగోలు చేయండి.

1. డాక్ట‌ర్ ట్ర‌స్ట్ ఫింగ‌ర్ టిప్ ప‌ల్స్ ఆక్సిమీట‌ర్ 209 చాలా వ‌ర‌కు క‌చ్చిత‌మైన రీడింగ్స్‌ను చూపిస్తుంది. 2-3 తేడాతో రీడింగ్స్ వ‌స్తాయి. ఈ ఆక్సిమీట‌ర్ అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ల‌లో ల‌భిస్తోంది. దీని ధ‌ర సుమారుగా రూ.3600 వ‌ర‌కు ఉంది.

2. చాయిస్ ఎంమెడ్ ఫింగ‌ర్ టిప్ ప‌ల్స్ ఆక్సిమీట‌ర్ ఎండీ300సీఎన్‌340 ఎస్‌పీవో2 లెవ‌ల్స్‌ను క‌చ్చితత్వంతో చూపిస్తుంది. దీన్ని అమెజాన్‌లో కొన‌వ‌చ్చు. దీని ధ‌ర రూ.3100 గా ఉంది.

3. నోయ్‌మి యొబెక‌న్ ఫింగ‌ర్‌టిప్ ప‌ల్స్ ఆక్సిమీట‌ర్ అమెజాన్‌లో ల‌భిస్తోంది. ఇది కూడా ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ ను క‌చ్చితత్వంతో చూపిస్తుంది. ఈ మీట‌ర్ ధ‌ర రూ.3239గా ఉంది.

4. ఎల్‌కో ఈఎల్‌-560 ఫింగర్ టిప్ ప‌ల్స్ ఆక్సిమీట‌ర్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌ల‌లో ల‌భిస్తోంది. ఎస్‌పీవో2 రీడింగ్స్ ను ఇది కూడా స‌రిగ్గానే చూపిస్తుంది. ఈ మీట‌ర్‌ను రూ.1400 ధ‌ర‌కు కొన‌వ‌చ్చు.

5. మెడిటివ్ ఫింగ‌ర్‌టిప్ ప‌ల్స్ ఆక్సిమీట‌ర్ అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ఎస్‌పీవో2 లెవ‌ల్స్ ను ఇది క‌చ్చిత‌త్వంలో కొలుస్తుంది. ఈ మీట‌ర్ ధ‌ర రూ.1200 గా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version