దేశంలోనే ద బెస్ట్ డిజిపిగా… గౌతమ్ సవాంగ్ రికార్డ్ !

-

భారత దేశంలోనే బెస్ట్ డిజిపిగా ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ మరోసారి నిలిచారు. ప్రజలకు ఉత్తమ సేవలు అందించడంతో… ఆయనను అత్యుత్తమ డీజీపీగా ప్రకటిస్తున్నట్లు ది బెటర్ ఇండియా సంస్థ తెలిపింది. గత రెండు సంవత్సరాలలో కరోనా ఎఫెక్ట్ తో అనేక కఠినమైన సవాళ్ళను ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆ సంస్థ పేర్కొంది.

అలాంటి కష్ట సమయాల్లోనూ ఏపీ డీజీపీ సవాంగ్ రాష్ట్ర ప్రజలకు విశేష సేవలు అందించాలని కొనియాడింది ఆ సంస్థ. 2001 వ సంవత్సరానికి దేశంలో ఉత్తమ సేవలు అందించిన 12మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల జాబితాను ఆ సంస్థ శనివారం విడుదల చేసింది.

దిశా యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పించడంలో డిజిపి సవాంగ్ సేవలను ది బెటర్ ఇండియా సంస్థ ప్రశంసించింది. అత్యుత్తమ టెక్నాలజీతో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ చాలా బాగా పనిచేస్తుందని పేర్కొంది.ఇలాంటి సేవలు మరిన్ని అమలు చేయాలని… ఏపీ డీజీపీ గౌతమ్ ను దేశంలోని అందరూ మార్గదర్శకంగా తీసుకోవాలని ఆ సంస్థ స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version