అవంతి ప్లేస్ అంబటికి..ఫిక్స్ అయినట్లేనా?

-

కొత్త సంవత్సరం వచ్చేసింది…ఈ కొత్త ఏడాది..అధికార వైసీపీలో కొత్త కొత్త మార్పులు చేయడానికి జగన్ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే కొత్త ఏడాది నుంచి పెన్షన్ పెంచిన విషయం తెలిసిందే. అలాగే ప్రజలని ఆకట్టుకోవడానికి ఇంకా సరికొత్త పథకాలతో రావడానికి జగన్ ప్రభుత్వం సిద్ధమవుతుంది. అదే సమయంలో సరికొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడానికి కూడా రెడీ అవుతున్నట్లు కథనాలు వస్తున్నాయి.

జగన్ మొదట్లో చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే గత డిసెంబర్‌లో మంత్రివర్గ విస్తరణ చేయాలి. కానీ ఎందుకో ఆ కార్యక్రమానికి బ్రేక్ వేశారు. కానీ ఈ కొత్త ఏడాదిలో మాత్రం మంత్రివర్గంలో మాపులు ఖాయమని తెలుస్తోంది. అయితే పూర్తిగా మంత్రివర్గంలో మార్పులు జరుగుతాయా? లేక కొందరిని మార్చి…కొందరికే అవకాశం కల్పిస్తారా?అనేది చూడాలి.

అయితే ఇప్పటికే మంత్రివర్గం రేసులో పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. మంత్రి పదవి కొట్టేయడానికి పలువురు ఎమ్మెల్యేలు చూస్తున్నారు. ఇదే క్రమంలో సీనియర్ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఎప్పటినుంచో మంత్రి పదవి కోసం కాచుకుని కూర్చున్న విషయం తెలిసిందే. ఎప్పుడో 1989లో ఒకసారి గెలిచిన అంబటి మళ్ళీ జగన్ గాలిలో 2019లో గెలిచారు. దీంతో ఈ సారి ఎలాగైనా పదవి దక్కించుకోవాలని చూస్తున్నారు. అయితే కాపు కోటాలో అంబటి పదవి కొట్టేయడానికి చూస్తున్నారు. కాకపోతే ఎక్కడకక్కడ కాపు నేతలు పదవులు కోసం కాచుకుని కూర్చున్నారు. కృష్ణా, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో కాపు ఎమ్మెల్యేలు పదవులు కోసం చూస్తున్నారు.

ఇక సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణని మంత్రివర్గంలో కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అవంతి శ్రీనివాస్‌ని మంత్రివర్గం నుంచి సైడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అవంతి ప్లేస్‌నే అంబటికి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇద్దరు నేతలు ఆ మధ్య పలు వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. మరి జగన్…అవంతిని మార్చి..ఆ ప్లేస్ అంబటికి ఇస్తారేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version