పాప మందుల కోసం 150 కిలోమీటర్లు బండి మీద వచ్చిన పోలీస్… అసలు ఏం జరిగింది…!

-

అది కేరళ… అలెప్పి… నాలుగేళ్ల బాలిక క్యాన్సర్ తో పోరాటం చేస్తుంది. క్యాన్సర్ ని ఎదుర్కోవడానికి ఆ వయసులో ఆమె చాలా కష్టపడుతుంది. ఆమెకు అంత చిన్న వయసులో కీమో థెరపి చేయిస్తున్నారు కుటుంబ సభ్యులు. అలేప్పీ నుంచి తిరువనంతపురం. అక్కడ ఉన్న ప్రాంతీయ ఆస్పత్రిలో బాలికకు చికిత్స చేయిస్తారు. అయితే ఇప్పుడు లాక్ డౌన్ నడుస్తుంది కదా… మరి అక్కడి నుంచి తిరువనంతపురం రావడం చాలా కష్టం.

అప్పటి వరకు వైద్యులు మందులు వాడండి పరిస్థితి మెరుగు పడిన తర్వాత చికిత్స చేయిద్దాం అని చెప్పారు. ఇక అప్పటి నుంచి పాప కు మార్చ్ 29 సాయంత్రం ఆరు గంటలకు మందులు కావాల్సి వచ్చింది. ఆ మందులు అక్కడ దొరకకపోవడంతో… కుటుంబ సభ్యులు అక్కడ సివిల్ పోలీస్ రతీష్ ను సంప్రదించారు. వెంటనే స్పందించిన రతీష్… తిరువనంతపురం మెడికల్‌ కాలేజ్‌లో పనిచేస్తున్న తన స్నేహితుడు, మాజీ పోలీస్‌ అధికారి విష్ణుకు పాప పరిస్థితి వివరించారు.

కాని ఇక్కడ చిన్న సమస్య వచ్చింది. విష్ణు వెంటనే స్పందించి పాపకు కావాల్సిన మందులను తిరువనంతపురం నుంచి పంపిస్తా అని మందుల చీటీ తీసుకుని వెళ్ళారు. కాని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చీటీ పాతది అని తెలిసి షాక్ అయ్యారు. కాని ఆ పాపకు మందులు చాలా అవసరం. లేకపోతే పాప ప్రాణాలకు ప్రమాదం. వెంటనే రతీష్ కి చెప్పకుండా… విష్ణు 150 కిలోమీటర్లు బండి మీద వచ్చి సాయంత్రం 5;10 నిమిషాలకు వాటిని అందించారు. దీనితో అక్కడ ఉన్న వాళ్ళు విష్ణు చేసిన స్నేహానికి ధన్యవాదాలు చెప్పి అభినందించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version