బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వారిపై తెలంగాణ పోలీసులు వరుసగా కేసులు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 25 మందికి పైగా సినీ హీరోలు, టీవీ ఆర్టిస్టులు, యూట్యూబర్లు, ఇన్ ఫ్లూయెన్సర్లపై పంజాగుట్ట, మియాపూర్ పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే యాంకర్ విష్ణుప్రియ, రీతూ చౌదరిని పోలీసులు విచారించారు.
తాజాగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ మీద హీరో నవదీప్ స్పందించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ..‘బెట్టింగ్ యాపుల ద్వారా నష్టపోయామని చాలా మంది యువత నాకు కూడా మెసేజెస్ చేస్తున్నారు.ఇలాంటి వాటికి దూరంగా ఉంటేనే యువత భవిష్యత్తు బాగుంటుంది. నేను చేయబోతున్న షోలో కూడా ఒక గేమింగ్ కంపెనీ స్పాన్సర్షిప్ ఇస్తుంటే ఆ షో చేయాలా? వద్దా? అని ఆలోచిస్తున్నాం. నిజంగానే టాలీవుడ్ సెలబ్రిటీలు తప్పు చేశారా? లేదా? అనేది చూడాలి’ అని కీలక వ్యాఖ్యలు చేశారు.