తెలంగాణ రాష్ట్ర సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. రెవెన్యూ శాఖలో 10,954 పోస్టులు మంజూరు చెసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ శాఖలో కొత్తగా 10,954 గ్రామ పాలనా అధికారుల పోస్టులు మంజూరు చేసింది. మాజీ వీఆర్వోలు, మాజీ వీఆర్‌ఏల నుంచి ఆప్షన్లు తీసుకుని వీటి నియామకాలు చేపట్టనున్నారు. ఈమేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
- 10954 గ్రామ పాలన అధికారి పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ
- రెవెన్యూ శాఖలో కొత్తగా గ్రామ పాలన అధికారుల (GPO ) పోస్టులు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు.
- నూతన గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థకు “జిపిఓ” గా నామకరణం.