ఇటీవలి కాలంలో రెస్టారెంట్లు, హోటల్స్‌లో కుళ్లిన ఆహార పదార్థాలను విచ్చలవిడిగా వినియోగదారులకు అమ్ముతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే మనుషుల ఆరోగ్యాలతో కొన్ని హోటల్స్ నిర్వాహకులు, కార్పొరేట్స్ వ్యాపారం చేస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు.
తాజాగా వనపర్తి జిల్లా కేంద్రంలోని రిలయన్స్ స్మార్ట్ మార్ట్‌లో కుళ్లిన ఆహార పదార్థాలు కస్టమర్ల కంట పడ్డాయి.మార్ట్‌లో కొన్న ఆహారపదార్ధాలు ఫంగస్ పట్టి కుళ్లిపోవడంతో ఓ కస్టమర్ యజమానికి ఫిర్యాదు చేశాడు.అయితే, యజమాని నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.కస్టమర్ ఫిర్యాదుతో తనిఖీలు చేసి మార్ట్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులు తాత్కాలికంగా మూసివేశారు.