బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహరంలో ఇప్పటికే 11 మందికి పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అందులో టీవీ ఆర్టిస్టులు, యాంకర్స్, యూట్యూబర్స్, ఇన్ ఫ్లూయెన్సర్స్ ఉన్నారు. అయితే, నోటీసులు అందుకున్న వారిలో యాంకర్ విష్ణుప్రియ ఒకరు.
తాజాగా ఆమె గురువారం ఉదయం తన లాయర్‌తో కలిసి పంజాగుట్ట పీఎస్‌కు విచారణకు హాజరయ్యారు. విచారణలో భాగంగా విష్ణుప్రియ ప్రమేయం ఉందని తెలిస్తే ఆమెను అరెస్టు చేస్తారా? లేదా వదిలేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఆమె చెప్పే సమాధానాలతో పోలీసులు సంతృప్తి చెందకపోతే అరెస్టు తప్పదని తెలుస్తోంది. కాగా, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌తో ఒక్కొక్కరు కోట్లకు పడగలెత్తగా మనీ లాండరింగ్ జరిగి ఉంటుందని అనుమానంతో ఈడీ సైతం రంగంలోకి దిగనుందని సమాచారం.