ఆస్ట్రేలియా వేదిక జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (BGT)లో టీమిండియా అద్భుతం చేసింది. యువ ఆటగాళ్లతో బరిలోకి దిగిన జట్టుకు ఓటమి తప్పదని అంతా భావించారు. ఈ సిరీస్‌కు రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో బుమ్రా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా కేవలం 150 పరుగులకే చేతులెత్తేసింది. దీంతో ఈ మ్యాచ్ కూడా పోయినట్లే అని క్రికెట్ అభిమానులు భావించారు.
కానీ అనుహ్యంగా కెప్టెన్ బుమ్రా అద్భుతం చేసి చూపించాడు. అతని నాయకత్వంలో యువ బౌలర్లు రెచ్చిపోయి బౌలింగ్ చేశారు. దీంతో బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన ఆసీస్ కేవలం 104 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇండియా ఇంకా 46 పరుగుల ఆధిక్యంలో ఉన్నది. డే 1లో 7 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా డే2 ప్రారంభం కాగానే మిగతా 3 వికెట్లు సైతం కోల్పోయింది. ఇప్పుడు ఇండియా మరోసారి బ్యాటింగ్ చేసి కంగారులకు టార్గెట్ విధించనుంది.