మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల అసెంబ్లీకి జరిగిన ఎమ్మెల్యే స్థానాలకు ఇటీవల బై పోల్స్ జరిగిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం ఈ రెండు రాష్ట్రాలతో పాటు ఉపఎన్నికలకు సైతం ఎన్నికల సంఘం ఫలితాలను ప్రకటిస్తోంది. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమి ఆధిక్యంలో దూసుకుపోతోంది.
ఇక కేరళలోని వయనాడ్ ఎంపీ ఉపఎన్నికలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక కేరళలోని చెలక్కర స్థానం ఎమ్మెల్యే ఉపఎన్నికలో సీపీఎం అభ్యర్థి ప్రదీప్ లీడ్‌లో కొనసాగుతున్నారు. మరోవైపు పాలక్కాడ్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్‌పై బీజేపీ అభ్యర్థి కృష్ణకుమార్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ ఎన్నికలో బీజేపీ గెలిస్తే సరికొత్త చరిత్ర సృష్టించనుంది.