టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ ఫిల్మ్ ‘ఆచార్య”. మెగాస్టార్ చిరంజీవి- మె గా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమా కోసం మెగా అభిమానులే కాదు సినీ లవర్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తు్న్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ మూవీపై అంచనాలను ఇంకా పెంచేసింది.
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పిక్చర్..డెఫినెట్ గా రికార్డులన్నిటినీ తిరగ రాస్తుందని సినీ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. తండ్రీ తనయులు చిరు-చెర్రీలను వెండితెరపైన చూసి మెగా అభిమానులు సంబురాలు చేసుకోనున్నారు.