Bharat Biotech: భారత్ బయోటెక్ చుక్కల మందు టీకా లాంఛ్

-

భారత్ బయోటెక్ తయారు చేసిన కరోనా నాసికా టీకాను కేంద్రం ఆవిష్కరించింది. కేంద్ర వైద్య శాఖ మంత్రి మన్​సుఖ్ మాండవీయ, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ కలిసి ఈ టీకాను గురువారం దిల్లీలో అందుబాటులోకి తెచ్చారు. ఇన్​కొవాక్ పేరుతో భారత్ బయోటెక్ సంస్థ ఈ టీకాను అభివృద్ధి చేసింది.

“ఈ టీకా పంపిణీ చాలా సులువు. సూది అవసరం లేదు. ఈ టీకాతో ఐజీజీ, ఐజీఏ, టీ-సెల్ అనే మూడు రకాల ప్రతిస్పందనలు వస్తాయి. ప్రపంచంలో మరే ఇతర వ్యాక్సిన్​తో ఇది సాధ్యం కాదు” అని కృష్ణ ఎల్ల వివరించారు.

​ గతేడాది నవంబర్​లోనే ఇన్​కొవాక్  వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతులు ఇచ్చింది. నాసికా టీకాను 18 ఏళ్లు పైబడినవారికి బూస్టర్‌ డోసుగా అందించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొవిన్ ప్లాట్​ఫామ్​లోనూ ఈ టీకాను చేర్చారు. ఇకపై ప్రజలందరికీ ఈ టీకా అందుబాటులో ఉండనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version