దుబాయ్‌లో డ్రాగన్ మార్ట్ కు పోటీగా ‘భారత్ మార్ట్’

-

ప్రధాని నరేంద్ర మోడీ దుబాయ్ పర్యటనతో చైనా డ్రాగన్‌కు భారీ షాక్ తగలనుంది.  దుబాయ్‌లో ‘భారత్‌ మార్ట్‌’కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రధాని షేక్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌, ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. ఈ మార్ట్ వల్ల లక్షలాది మందికి లబ్ధి చేకురనుంది. భారత్ మార్ట్ అనేది భారత సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల కంపెనీలకు అందుబాటులో ఉండే గిడ్డంగుల సౌకర్యం.ఎగుమతులను ప్రోత్సహించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఇది భారత  సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల రంగం అంతర్జాతీయ కొనుగోలుదారులను చేరుకోవడానికి సహాయపడుతుంది.

భారత్ మార్ట్ 2025 నాటికి అందుబాటులోకి వస్తుందని అంచనా. ఇది భారతీయ సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల కంపెనీలు దుబాయ్‌లో వ్యాపారం చేయడానికి వీలు కల్పించే నిల్వ సౌకర్యం. ఇది చైనా ‘డ్రాగన్ మార్ట్’ తరహాలో వివిధ రకాల ఉత్పత్తులను ప్రదర్శించడానికి భారతీయ ఎగుమతిదారులకు ఏకీకృత వేదికను అందిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news