దేశీయ కోవిడ్ వ్యాక్సిన్ కోవాక్సిన్ పై భారత్ బయటెక్ కీలక ప్రకటన చేసింది. కోవిడ్ తీవ్ర లక్షణాలు సోకకుండా కోవాక్సిన్ 93.4 శాతం కాపాడుతుందని భారత్ బయోటెక్ ప్రకటించింది. కోవాక్సిన్ 3వ దశ క్లినికల్ ట్రయిల్ డేటాను లాన్ సెట్ ప్రచురించింది. క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొన్న వారిలో 0.5% కంటే తక్కువ మందిలో తీవ్ర దుష్పరిణామాలు ఉంటాయని స్పష్టం చేసింది. డెల్టా వేరియంట్ సోకకుండా వ్యాక్సిన్ 65.2 శాతం కాపడగలదని భారత్ బయోటెక్ పేర్కొంది.
అన్ని రకాల కోవిడ్ స్ట్రైన్స్ ల నుండి 70.8 శాతం రక్షణ ఇస్తుందని భారత్ బయోటెక్ స్పష్టం చేసింది. భారత్ బయోటెక్ కోవాక్సిన్ 3వ దశ క్లినికల్ ట్రయల్ ఫలితాలపై ఐసీఎంఆర్ డిజి బలరాం భార్గవ హర్షం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా కోవాక్సిన్ టీకా వేసుకున్న వారికి ఎలాంటి ఆంక్షలు లేకుండానే తమ దేశంలోకి అనుమతిస్తామని…వారు క్వారంటైన్ లో ఉండాల్సి అవసరం లేదని ప్రకటించింది. అంతే కాకుండా బ్రిటన్ కూడా కోవాక్సిన్ వేసుకున్నవారిపై ఆంక్షలను ఎత్తివేసింది.