భారతీయుడు 2 సెన్సార్ పూర్తి…. నిడివి ఎంత అంటే?

-

స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం భారతీయుడు -2. భారతీయుడు’కు కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ జులై 12న తెలుగు, తమిళ, కన్నడ ,మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.

ఇదిలా ఉంటే ..ఈ సినిమాకి సంబంధించిన తమిళ వర్షన్ సెన్సార్ పూర్తయింది. మొత్తం 180 నిమిషాల 4 సెకండ్ల నిడివి ఉన్నట్టుగా సెన్సార్ సర్టిఫికెట్ ద్వారా వెల్లడైంది. ఇక ఈ మూవీకి సంబంధించి దాదాపుగా 5 మోడిఫికేషన్లు సెన్సార్ టీం సూచించినట్లుగా సమాచారం. పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అని హెచ్చరించే టైటిల్స్ చాలా చిన్నగా ఉండడంతో వాటిని పెంచాల్సిందిగా తెలిపారు. అంతేకాకుండా బ్రైబ్ మార్కెట్ అనే పదాన్ని మార్చాల్సిందిగా సూచించారు.ఒకచోట క్లీవేజ్ షో ఉండగా ఆ విజువల్స్ మార్చాల్సిందిగా సూచించారు. అలాగే కొన్ని బూతు పదాలను మార్చాల్సిందిగా కూడా సూచనలు చేశారు. అలాగే వేరే సినిమాలో ఉన్న కొంత కంటెంట్ వాడుకోవడంతో దానికి సంబంధించిన ఎన్వోసీ సర్టిఫికెట్ సమర్పించాలని సూచించారు.కాగా, ఎస్‌జే సూర్య, బాబీ సింహా, సిద్దార్థ్‌,మధుబాల, ర‌కుల్ ప్రీత్ సింగ్,బ్రహ్మానందం, స‌ముద్రఖని, ప్రియా భవాని శంకర్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు.ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్ పై ఉద‌య‌నిధి స్టాలిన్‌-సుభాస్కరన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.ఇటీవల విడుదలైనటువంటి ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version