కాలేశ్వరం ప్రాజెక్ట్ ను బరాబర్ సందర్శిస్తామని స్పష్టం చేశారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి గెస్ట్ హౌస్ లో సీఎల్పీ బృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ….. భద్రాచలం నియోజకవర్గంలో ముంపు గురైన ప్రాంతాలను నీటిపారుదల ప్రాజెక్టు సందర్శించడానికి వెళుతుండగా పోలీసులు అడ్డుకొని అక్రమంగా అరెస్ట్ చేశారు… అధికారులు ముంపు ప్రాంతాలని ప్రాంతాల్ని సందర్శించలేదు వారికి సహాయం అందించలేదని ఫైర్ అయ్యారు.
ముంపు అంచనా వేయలేదు..లక్షల కోట్ల ప్రాజెక్టులు నీటి మునిగిపోయాయి….భద్రాచలం పినపాక నియోజకవర్గాల్లో అడుగడుగునా పోలీసులు అడ్డుకొని ఇల్లందు గెస్టహౌస్ లో వధిలి వెళ్ళారని
మమ్మల్ని ఆటంకవాదుల్లాగా ఇబ్బందులకు గురి చేసి ఇక్కడ వదిలి వెళ్లారని ఓ రేంజ్ లో అగ్రహించారు. గెస్ట్ హౌస్ తాళాలు లేవు రెండు గంటల పాటు తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు..బరాబర్ మొదలుపెట్టిన కార్యక్రమం పూర్తి చేస్తామన్నారు. లక్షల కోట్ల ప్రాజెక్టులు నీట మునిగాయి..సందర్శనకు బయలుదేరిన మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు సందర్శించడానికి బయలుదేరుతున్నామని తెలిపారు.