కెసిఆర్ ను టచ్ చెయ్.. బండి సంజయ్ కి భట్టి సవాల్ !

-

కాంగ్రెస్ పార్టీ ఎమ్యెల్యే భట్టి .. బిజేపి, టిఆర్ఎస్ పార్టీలపై ఫైర్ అయ్యారు. రైతు పండించిన పంట కొనను అనే మాటలు ఎక్కడా వినలేదని.. రెండు పార్టీలు రాజకీయం కోసం రైతులను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం అవినీతి తెలుసని బండి సంజయ్ అంటారు..కెసిఆర్..సంజయ్ నేను టచ్ చెయ్ అంటున్నారు. సంజయ్… మరి టచ్ చెయ్” అంటూ సవాల్ విసిరారు భట్టి. కెసిఆర్, బండి సంజయ్.. ఇద్దరు కలిసి నాటకం ఆడుతున్నారని అగ్రహించారు.

తెరాస…బీజేపీ పొలిటికల్ గేమ్ ఆడుతున్నాయని.. ప్రజలు పరిశీలించాలని పేర్కొన్నారు. ప్రజలు ఆలోచన చేయాలన్నారు. ఏడు యేండ్ల నుండి నదీ జలాల వాట ఇవ్వక పోతే… కెసిఆర్ నువ్వు ఇప్పుడు మాట్లాడితే ఎట్లా ? అని ప్రశ్నించారు. ఏడెండ్ల నుండి అద్భుతాలు సృష్టిస్తున్న అంటావని.. కేంద్రం గెజిట్ ఇచ్చిందన్నారు. రైతులతో రెండు ప్రభుత్వాలు ఫుట్ బాల్ ఆడుతున్నాయని మండిపడ్డారు భట్టి విక్రమార్క. అసలు ఏం జరుగుతుంది… నీటి వాటలో కేంద్రం అడిగేది ఒకటి.. కెసిఆర్ చెప్పేది ఇంకొకటి.. రాష్ట్రంలో అసలు ఎం జరుగుతుంది.. అడ్డగోలుగా ఇప్పుడు మాట్లాడుతున్నారని కెసిఆర్ పై మండిపడ్డారు. కృష్ణా..గోదావరి మీద స్పష్టత లేకుండా చేశారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version