తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తాజాగా బీజేపీ ప్రభుత్వం పై విమర్శలు చేశారు. భారతదేశంలో అప్రజాస్వామిక పాలన నడుస్తుందా అంటూ ఆయన బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ… బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోందని ఎద్దేవా చేశారు. అలాగే ఇది వరకు మధ్యప్రదేశ్, గోవా, మణిపూర్ రాష్ట్రాలలో రాజకీయ కుట్రలకు తెరలేపిన బీజేపీ ప్రభుత్వం తాజాగా రాజస్థాన్ రాష్ట్రం లోను రాజకీయ కుట్రలకు తెరలేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా రాజస్థాన్ గవర్నర్ ఢిల్లీకి దాసోహం అయ్యారని ఆయనపై నిప్పులు చెరిగారు.
రాష్ట్రంలోని ప్రభుత్వాలు కేవలం ఢిల్లీ నేతల డైరెక్షన్ లోనే రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కు ఉందని తెలియజేశారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ కాపాడుకునేందుకు ” సేవ్ డెమోక్రసీ – సేవ్ కానిస్టూషన్ ” నినాదంతో తాము ముందుకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు.