నేను పాదయాత్ర చేసిన అన్ని చోట్లా కాంగ్రెస్ విజయం : భట్టి

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా సీఎం అభ్యర్థి ఎవరు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. నిన్న రేవంత్ రెడ్డి రాత్రి 8 గంటలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనే మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ సాయంత్రం మళ్లీ డీ.కే.శివకుమార్ ను అధిష్టానం ఢిల్లీకి రావాలని పిలిచింది. డీ.కే. శివకుమార్ తో పాటు అప్జర్వర్లను కూడా ఢిల్లీకి పిలిపించారు. ఇవాళ ఉదయం ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క కూడా ఢిల్లీకి వెళ్లారు.

థాక్రె, డీ.కే.శివకుమార్ తో వేర్వేరుగా భట్టి, ఉత్తమ్ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే భట్టి ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. అరాచక పాలనలో కుంగిపోతున్న జీవితాలకు విముక్తి కలిగించాలనే లక్ష్యమే తన పాదయాత్రకు ఆయువు పోసిందని తెలిపారు. నైరాశ్యంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలనే ఆశయంతో అడుగులు వేశాను. మండుటెండలు, వానలు, చలి.. మన సంకల్పానికి అడ్డు కాలేదు. 109 రోజులు, 1,364 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేశానని.. అడుగుపెట్టిన నియోజకవర్గాల్లో దాదాపు కాంగ్రెస్ విజయం సాధించిందని ట్వీట్ చేశారు భట్టి విక్రమార్క.

Read more RELATED
Recommended to you

Exit mobile version