Pawankalyan : భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ రిలీజ్

-

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మరియు హీరో దగ్గుబాటి రానాతో కలిసి మల్టీస్టారర్‌ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మలయాళం లో సూపర్‌ హిట్‌ అయిన… అయ్యప్పనుమ్‌ కోషియమ్‌ సినిమాను పవన్‌ తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. సాగర్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే.. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలోనే.. ఈ సినిమా మేకింగ్ వీడియో ను చిత్ర బృందం రీలిజ్ చేసింది.

అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా భీమ్లా నాయక్ సినిమా నుంచి టైటిల్ సాంగ్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇక ఈ టైటిల్ సాంగ్… భీమ్లా నాయక్ పేరుతో సాగింది. ఈ సాంగ్ లో పవన్ కళ్యాణ్… పోలీస్ డ్రెస్ లో చాలా పవర్ ఆఫీసర్ గా కనిపిస్తారు.ఇక ఈ టైటిల్ సాంగ్ ను రామ జోగయ్య రాయగా ఎస్.ఎస్ తమన్ మ్యూజిక్ అందించాడు. టైటిల్ సాంగ్ తో భీమ్లా నాయక్ సినిమా మరింత అంచనాలు పెంచేసింది. కాగా ఈ సినిమా జనవరి 12 న విడుదల కానుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version