రంగారెడ్డి జిల్లాలోని నాగారంలో భూదాన్ భూముల వ్యవహరంలో తెలంగాణకు చెందిన ముగ్గురు ఐపీఎస్ అధికారులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అందులో సీనియర్ ఐపీఎస్ అధికారులు మహేష్ భగవత్, స్వాతి లక్రా, సౌమ్య మిశ్రాలు ఉన్నారు. వీరికి హైకోర్టులో చుక్కెదురైంది.
ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నతాధికారులకు చెందిన భూదాన్ భూములను ఏప్రిల్ 27న నిషేధిత జాబితాలో పెట్టాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ తీర్పును సవాలు చేస్తూ ముగ్గురు ఐఏఎస్‌లు మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. బుధవారం ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.ఈ కేసులో తదుపరి వాదనలు సైతం సింగిల్ బెంచ్‌లోనే వినిపించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులను ఆదేశించింది.