యుటర్న్, సవ్యసాచి, రూలర్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా సంపత్‌నంది రూపొందిస్తున్న `సీటీమార్` చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో వుంది. ఇదిలా వుంటే తన వివాహ బంధంపై వస్తున్న రూమర్‌లపై భూమిక సైలెంట్‌గానే స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. 2007లో ఇదే రోజు యోగా గురు భరత్ టాకూర్‌ని వివాహం చేసుకుంది. వీరికి ఓ బాబు కూడా వున్నాడు. తను భరత్ టాకూర్‌తో విడిపోలేదని, ఇద్దరం వైవాహిక జీవితాన్ని ఆనందంగా ఆస్తాదిస్తున్నామని క్లారిటీ ఇచ్చేసింది.
మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా భర్త భరత్ టాకూర్‌తో వున్న ఓ ఫొటోని షేర్ చేస్తూ ఆసక్తికరమైన పోస్ట్‌ని పెట్టింది. `వెయ్యి మైళ్ళ ప్రయాణమైనా ఒకే అడుగుతో మొదలవుతుంది …. ప్రేమ ……. అది ప్రేమే, ప్రేమని నేర్చుకోవడం.. అవగాహన..ఇదొక ఆనందకరమైన ప్రయాణం. ఒకరి గురించి మరొకరు తెలుసుకోవడం అంటే మనమే .. . దేవుడు మమ్మల్ని మా ప్రయాణాన్ని ఆశీర్వదించాలి.. జీవితంలో మీరు చేసే పనుల పట్ల మీ అంకితభావం చూసి గర్విస్తున్నాను. మ్యారేజ్ యానివర్సీరీ శుభాకాంక్షలు` అని షేర్ చేసి రూమర్‌లకు చెక్ పెట్టింది.