భాగ్యనగరానికి మళ్లీ మొదలైన భారీ వర్షాలతో హైదరాబాద్ ప్రజలు టెన్సన్ పడుతున్నారు. హైదరాబాద్ పాతబస్తీలోని మీర్ ఆలం చెరువుకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఏ క్షణమైనా చెరువుకు గండి పడే అవకాశం కనిపిస్తోంది. అప్రమత్తమైన అధికార యంత్రాంగం చెరువు పరిసర ప్రాంతాల్లోని ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లి పోవాలంటూ హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే చెరువు పక్కనే ఉన్న జూ పార్క్ లోకి భారీగా వరద నీరు వచ్చిన చేరింది. ఇక . హుస్సేన్ సాగర్ అలాగే హిమాయత్ సాగర్ లు నిర్మాణం కాక ముందు నుండే హైదరాబాద్ నివాసితులకి నీరు అందించేందుకు ఈ మీర్ ఆలం ఉపయోగపడేది. హైదరాబాద్ రాష్ట్రానికి అప్పటి ప్రధాని మంత్రిగా వ్యవహరించిన మీర్ ఆలం బహదూర్ చేత 1804 లో ఈ చెరువుని తవ్వించారు. ఇక మూసీ నది శాంతించాలని శాంతి పూజలు చేయడానికి కూడా సిద్దం అయింది తెలంగాణా ప్రభుత్వం.