ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు అంతా ఇప్పుడు కరోనా వైరస్ చుట్టూ తిరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ ఈ వైరస్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడు మందు వస్తుంది ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు కనిపెడతారు అంటూ రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఆంధ్ర రాజకీయాల్లోకి వస్తే కరోనా వైరస్ వల్ల చాలామంది పేదవాళ్ళు, మధ్య తరగతి కుటుంబానికి చెందిన వారి ఇంటికి పరిమితం కావడంతో వాళ్ల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి.
మరోపక్క అసలు ఈ టైంలో ఏం చేస్తున్నారు?, అప్పట్లో అయితే ధర్నా చేస్తున్న రైతుల దగ్గరకు వచ్చి సంఘీభావం తెలిపారు. మరీ ఇంత దారుణమైన అతి క్లిష్టమైన సమయంలో, రాష్ట్రం ఇంత దారుణమైన పరిస్థితిలో ఉంటే అసలు భువనేశ్వరి మేడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారా? మరి ఎక్కడైనా ఉన్నారా? అంటూ తెగ సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు.