ఆమె బయోపిక్ కోసం పోటీ పడుతున్న సమంత, దీపిక పదుకొణె ..?

-

మజిలీ, ఓ బేబి సినిమాలతో రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న అక్కినేని సమంత రీసెంట్ గా జాను సినిమాతో హ్యాట్రిక్ హిట్ దక్కించుకోవాలని చూసింది. కాని సమంత బ్యాడ్ లక్ తో భారీ ఫ్లాప్ ని చూసింది. తమిళం లో సూపర్ హిట్ అయిన 96 సినిమాకి రీమేక్ గా తెలుగులో దిల్ రాజు నిర్మించారు. ఇక ఈ సినిమా సౌత్ లో త్రిషకి మంచి కం బ్యాక్ మూవీ గా నిలిచింది. అంతేకాదు ఈ సినిమా తో మళ్ళీ త్రిష ట్రాక్ లోకి వచ్చి స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటుంది. ఇక కల్ట్ స్టోరీగా కోలీవుడ్ లో రూపొందించిన ఈ సినిమా ఇక్కడ కూడా భారీ సక్సస్ ని అందుకుంటుందనుకున్న దిల్ రాజు, సమంత లకి గట్టి షాక్ ఇచ్చింది.

 

ఇక దేశ‌వ్యాప్తంగా సౌత్, నార్త్ సహా అన్ని భాషల్లోను బ‌యోపిక్‌ల ట్రెండ్ ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అందులో భాగంగానే బాలీవుడ్ లో దంగల్, సూపర్ 30, ప్యాడ్ మాన్.. తెలుగులో మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా మహానటి ని తెరకెక్కించారు. అలాగే ఎన్.టి.ఆర్ బయోపిక్ ని రెండు భాగాలుగా రూపొందించారు. ఈ నేపథ్యంలో సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు సింగీతం శ్రీ‌నివాస‌రావు ఒక బయోపిక్ ని తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఈ బయోపిక్ లో స‌మంత, లేదా బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొణె నటిస్తారని ప్రచారం జరుగుతుంది.

ప్ర‌ముఖ క‌ర్ణాట‌క గాయ‌ని, న‌ర్త‌కి, సాంస్క్ర‌తిక ఉద్య‌మ‌కారిణి, దేవ‌దాసి.. బెంగ‌ళూరు నాగ‌ర‌త్త‌మ్మ జీవిత క‌థ‌ ని సింగీతం తెరపై ఆవిష్కరించబోతున్నారని తాజా సమాచారం. క‌ర్ణాట‌క సంగీత ప్రాచుర్యానికి విశేష కృషిచేయ‌డంతో పాటు త్యాగ‌రాజ ఆరాధ‌నోత్స‌వాల‌కు ఆద్యురాలిగా నాగ‌ర‌త్త‌మ్మ గొప్ప కీర్తి ని సాధించారు. అంతేకాదు మ‌హిళా హ‌క్కుల కోసం పోరాడారు. స్పూర్తిదాయ‌కంగా సాగిన ఆమె జీవిత క‌థ‌ను నేటి త‌రాల‌కు తెలియ‌జేసేందుకు భారీ స్థాయిలో ఈ సినిమాకు స‌న్నాహాలు జరుగుతున్నాయట. అయితే ఈ సినిమాలో ముందు స‌మంత ను అనుకున్నప్పటికి పాన్ ఇండియా సినిమాగా రూపొందించాలంటే దీపికా ప‌దుకునే సమంత కంటే అన్ని విధాలుగా పర్‌ఫెక్ట్ అని మేకర్స్ భావిస్తున్నారట. ఇక ఈ కథ మాత్రం సమంత, దీపిక ల ఇద్దరికి విపరీతంగా నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికి ఇద్దరిలో ఎవరు ఫైనల్ అవుతారో ప్రస్తుతానికి సస్పెన్‌గా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version