Bichagadu 2 : ‘బిచ్చగాడు2’ స్నీక్​ పీక్​ ట్రైలర్.. కాన్సెప్ట్ అదిరిందిగా..

-

తమిళ్ హీరో విజయ్​ ఆంటోనీ నటించిన ‘బిచ్చగాడు’ సినిమా ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిన విషయమే. క్రేజీ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడంతో పాటు విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. ఈ సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్‌గా విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో బిచ్చగాడు-2 తెరకెక్కించారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి స్నీక్‌పీక్ ట్రైలర్‌ను విడుదల చేశారు. స్నీక్‌పీక్‌ అంటూ సినిమాలో ఓపెనింగ్ సీన్‌ను రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది చిత్రబృందం. ఈ స్నీక్‌ పీక్‌ ట్రైలర్‌ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ఎప్పుడూ ప్రయోగాలు చేయడంలో ముందు వరుసలో ఉండే విజయ్​.. ఇప్పుడు మరో మెట్టు ఎక్కి ఈ చిత్రాన్ని వినూత్న కాన్సెప్ట్​తో తెరకెక్కించారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version