ఇంటర్ విద్యార్థులకి బిగ్ అలర్ట్.. ఈరోజు నుండి పరీక్ష ఫీజు చెల్లించచ్చు..!

-

ఏపీలోని ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ఫలితాలు ఏప్రిల్ 12న రిలీజ్ అయ్యాయి. ఈ ఫలితాల్లో ఫస్ట్ ఇయర్ 67%, సెకండ్ ఇయర్ లో 78 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. ఫెయిల్ అయిన విద్యార్థులు ఆందోళన చెందక్కర్లేదు. ఎందుకంటే ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాల్లో సందేహాలు ఉన్న ప్రథమ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు రీ కౌంటింగ్ రీ వెరిఫికేషన్ అవకాశాన్ని ఇస్తున్నారు.

ఈ విషయాన్ని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి సౌరబ్ గౌర్ ఒక ప్రకటనలో తెలిపారు అడ్వాన్స్ సప్లిమెంటరీ మార్కులు తక్కువ వచ్చిన విద్యార్థులకు ఇంప్రూవ్మెంట్ కోసం రీ వెరిఫికేషన్ రీకౌంటింగ్ కోసం ఈరోజు నుండి ఈ నెల 24 దాకా పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. రీ వెరిఫికేషన్ కోసం 1300 రీకౌంటింగ్ కోసం 250 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది మే 24 నుండి జూన్ 1 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news