తల్లిదండ్రులూ బీకేర్ఫుల్.. భారత్‌లో నెస్లే నిబంధనల ఉల్లంఘన.. చిన్నారుల ఫుడ్స్‌లో చక్కెర.. !

-

చిన్నారుల ఆహార ఉత్పత్తుల సంస్థ నెస్లే ఇండియాలో నిబంధనలకి విరుద్ధంగా చిన్నపిల్లల ఆహార పదార్థాలకి చక్కెరని జోడిస్తున్నట్లు పబ్లిక్ ఐ సంస్థ పరిశోధనలో తెలిసింది. బ్రిటన్, జర్మనీ, స్విజర్లాండ్ వంటి అభివృద్ధి చెందిన దేశాలలో మాత్రం చక్కెర రైతు ఉత్పత్తులని విక్రయిస్తుందని తేల్చి చెప్పారు. భారత్ లో అత్యధికంగా అమ్ముడయ్యే పలు, సెర్లేక్ వంటి ఉత్పత్తుల్లో చక్కెరని జోడిస్తున్నట్లు తేలింది. ఊబకాయం ఇతర దీర్ఘకాలిక వ్యాధులు నివారణకి ఈ నిబంధనని అమల్లోకి తీసుకువచ్చారు.

ఆసియా ఆఫ్రికా లాటిన్ అమెరికా దేశాలలో నెస్లే ఈ నిబంధనని ఉల్లంఘించినట్లు తేలింది గత ఐదేళ్లలో భారత్ లో చిన్నారుల ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని 30% తగ్గించామని నెస్లే చెప్పింది. నిత్యం సమీక్షిస్తూ చక్కర శాతం తగ్గించడానికి మార్పులు చేర్పులు చేస్తున్నామని ప్రకటించింది. నెస్లే భారత్లో విక్రయిస్తున్న సెర్లేక్ ఉత్పత్తుల్లో సగటున ఒక్కో సర్వింగ్ కి మూడు గ్రాముల చక్కెర ఉంటున్నట్లు తెలుస్తోంది చక్కెర వ్యసనంగా మారే అవకాశం ఉంటుందని చిన్న పిల్లల్లో ఉత్పత్తులకి చక్కెరని జోడించకూడదని నిపుణులు చెప్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news