సంతానలేమికి కారణం చాలా సమస్యలు ఉన్నాయని తెలుసు.. కానీ మనకు తెలిసి చేజేతులా చాలా మంది అవగాహన లేమితో ఇబ్బందులలో పడుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం కాలంలో డాక్టర్లు చెబుతున్న ప్రకారం మగవారిలో స్పెర్మ్ కౌంట్ తక్కువ కావడం వలన సంతానలేమి కలుగుతోంది. ఇందుకు కారణాలుగా స్మోకింగ్ , వాతావరణ పరిస్థితులు, స్ట్రెస్, ఆల్కహాల్ వంటివి చెబుతున్నారు. ఇక తాజాగా చేసిన అధ్యయనాల ప్రకారం మరొక కొత్త సమస్య కూడా సంతానలేమికి కారణంగా తెలుస్తోంది. వీరు 18 నుండి 22 సంవత్సరాల వారిపై పరిశోధనలు చేశారు. తద్వారా వీరు తెలుసుకున్న విషయం చూస్తే, ఒక రోజులో 20 కంటే ఎక్కువ సార్లు ఫోన్ వాడుతున్న వారిలో స్పెర్మ్ కౌంట్ 21 % మేరకు తగ్గడానికి అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అందుకే ఇకపై ఫోన్ అధికంగా వాడినా సంతాన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
కాబట్టి పెళ్లి కానీ మరియు పెళ్లి అయి ఇంకా సంతానం లేని వారు ఫోన్ ను చాలా తక్కువగా వాడడం మంచిదని వీరు సూచిస్తున్నారు.