బిగ్‌బాస్‌–5 డేట్‌ అదేనా..?

-

‘బిగ్‌బాస్‌’ అంటేనే చాలు పెద్దల నుంచి చిన్నారుల వరకూ ఎప్పుడెప్పుడా వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. అది మొదలైదంటే అభిమానులు ఆనందానికి అంతే ఉండదు. ఇక ఇంట్లో రిమోట్ల గొడవులు ప్రారంభమే.అన్ని భాషల్లో వస్తున్న బిగ్‌బాస్‌ షోకు ఎన్నో విమర్శలు వస్తున్న కూడా రేటింగ్‌లో మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇటీవల బిగ్‌బాస్‌–4 సీజన్‌ విజయవంతంగా పూర్తయిన సంగతి విదితమే. ప్రస్తుతతం బిగ్‌బాస్‌ – 5 సీజన్‌ ప్రారంభం కానుంది. వివిధ రంగాలు విభిన్న ఆలోచనలతో కూడిన 20 మందిని బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా అన్ని సౌకర్యాలతో కూడిన ఓ ఇంట్లో ఉంచి ఆట ఆడిపించడమే ఈ షో లక్ష్యం.

ఈ సారీ నాగర్జుననేనా..?

స్టార్‌ మా బిగ్‌బాస్‌ –5 సీజన్‌కు ప్రణాళికలు రూపోందిస్తోంది. దీనిపై వారి యూట్యూబ్‌ చానెల్‌ లో ’మీరు బిగ్‌బాస్‌ షో’ను మిస్‌ అవుతున్నారా..? అని నిర్వహించిన ఓ పోల్‌ సర్వేకు విశేష స్పందన వచ్చింది. ఈ స్పందన ఆధారంగా త్వరలో బిగ్‌బాస్‌– 5 ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ సీజన్‌కూ హోస్ట్‌గా నాగార్జుననే ఉండనున్నారు. 3, 4 సీజన్‌లో నాగర్జున ఆకట్టుకుంటున్న కారణంగానే
ఈ సారీ కూడా ఆయననే హోస్ట్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం. కానీ.. ఈ సారి పాల్గొనే హోస్ట్, కంటెస్టెంట్‌కు భారీ మొత్తంలో నజరానా చెల్లించడానికి బిగ్‌బాస్‌ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

ఇప్పటికే ఆరుగురు..

ఇప్పటికే సోషల్‌ మీడియాలో ట్రేండింగ్‌లో ఉన్న ఆరుగురిని బిగ్‌ బాస్‌ హౌస్‌లోకి పంపించేందుకు నిర్వహకులు సెలక్ట్‌ చేశారనే వార్తలు సైతం చక్కర్లు కొడుతున్నాయి. అన్ని సవ్యంగా జరిగితే ఆగస్టు 29
(ఆదివారం) బిగ్‌బాస్‌–5ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు కసరత్తులు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version