Big Boss OTT Telugu: ‘బిగ్ బాస్’ హౌజ్‌లో షణ్ముక్ జస్వంత్..అరెయ్ ఏంట్రా ఇది అని షాక్ అయిన కంటెస్టెంట్స్

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ సిక్స్ ఓటీటీ వర్షన్ గేమ్ పదో వారంలోకి ఎంటరయింది. ఎవిక్షన్ ఫ్రీ బాక్స్ టాస్కును ‘బిగ్ బాస్’ ఇచ్చిన నేపథ్యంలో ఈ వారం గత సీజన్ లో ఆడిన కంటెస్టెంట్స్ గెస్టులుగా వస్తున్నారు. ఇటీవల సిరి హన్మంత్ హౌజ్ కు రాగా, తాజాగా షణ్ముక్ జస్వంత్ ఇంటికి వచ్చాడు. ఇందుకు సంబంధించిన ప్రోమోను ‘బిగ్ బాస్’ నిర్వాహకులు విడుదల చేయగా, అది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

shanmuk jashwanth

ఈ ప్రోమోలో షణ్ముక్ జస్వంత్..హౌజ్ లోకి ఎంట్రీ ఇవ్వగానే కంటెస్టెంట్స్ అందరూ హుషారుగా కనిపిస్తారు. ‘‘ బోలో ఐ యామ్ ఇన్ లవ్..ఐ యామ్ ఇన్ లవ్’’ అనే సాంగ్ తో షణ్ణు ఎంట్రీ ఇచ్చేస్తాడు. ఇక కంటెస్టెంట్స్ తో మాట్లాడుతూ.‘ బెస్ట్ కెప్టెన్..వరస్ట్ కెప్టెన్..’ఎవరు? అనేది ఎవరో చెప్పాలని అడుగతాడు.

ఆ తర్వాత హౌజ్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత కంటెస్టెంట్స్ ఎదురెదురు పడితే ఏం చేస్తారని అడుగుతాడు. బిందు మాధవి-అఖిల్ ఎదురెదరురైతే ఏం ఫీలవుతారు? ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయా? అని అడుగతాడు షణ్ముక్. అప్పుడు తాను అఖిల్ తో రిగ్రెట్ అయిన మూమెంట్‌ను బిందు మాధవి షేర్ చేసుకుంటుంది.

అంతలోనే ‘అందరిలోనూ ఉంది సమ్ థింగ్. సమ్ థింగ్’ సాంగ్ ప్లే కాగానే అందరూ నెక్స్ట్ గేమ్ పైన ఫోకస్ పెడతారు. అంతటితో ప్రోమో ముగుస్తుంది.

అలా ఈ శుక్రవారం ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ సాగిందని ప్రోమో చూస్తుంటే స్పష్టమవుతోంది. కంప్లీట్ ఎపిసోడ్ చూడాలంటే శుక్రవారం రాత్రి 9 గంటలకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version