Big Boss OTT Telugu: టెన్షన్..టెన్షన్..ఈ వారం ‘బిగ్ బాస్’ ఎలిమినేట్ చేసేది అషురెడ్డినా? అరియానానా?

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ సిక్స్ OTT పదో వారంలోకి ఎంటరయింది. ఇక ఈ వారం వీకెండ్ ఎంట్రీలో నాగార్జున అదరగొట్టేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను ‘బిగ్ బాస్’ నిర్వాహకులు విడుదల చేశారు. సదరు ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

‘బిగ్ బాస్’ షో నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు? అనే ఉత్కంఠ ఈ ప్రోమో ద్వారా ఇంకా ఎక్కువైంది. టాలీవుడ్ కింగ్, బిగ్ బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జున ‘రా రా బంగారం’ అనే సాంగ్ తో హుషారుగా ‘బిగ్ బాస్’ ఇంటిలోకి ఎంట్రీ ఇచ్చేశారు.

ఇక పలు క్వశ్చన్స్ ను నాగార్జున కంటెస్టెంట్స్ ను అడిగి సరదాగా మాట్లాడేశారు. అంతలోనే ఎవిక్షన్ ఫ్రీ పాస్ గురించి వివరించాడు నాగార్జున. బాబా భాస్కర్ మాస్టర్ వద్ద ఉన్న ఎవిక్షన్ ఫ్రీ పాస్ ను తన కోసం కాని ఇతరుల కోసం కాని వాడుకోవచ్చని సూచించారు. అయితే, నామినేషన్స్ లో ఉన్న అషురెడ్డి, అరియానా..లో ఎవరి కోసం బాబా మాస్టర్ పాస్ వాడుతారనేది సస్పెన్స్ గా మారింది.

మొత్తంగా ‘బిగ్ బాస్’ హౌజ్ లో, బయట బీబీ లవర్స్ లో టెన్షన్..టెన్షన్ షురూ అయింది. ఈ వారం ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరు? అరియానానా? అషురెడ్డినా? లేదా ఇద్దరా? అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. ఇంతకీ ఏం జరుగుతుందనేది తెలియాలంటే ఆదివారం సాయంత్రం 6 గంటలకు స్ట్రీమ్ అయ్యే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ OTT చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version