సోషల్ మీడియా సంచలనం దీప్తి సునైనా కు యూత్ లో మాంచి ఫాలోయింగ్ ఉంది. ఇక డాన్స్ లతో , సాంగ్స్ తో తనలోని టాలెంట్ ఎప్పుడూ బయట పెడుతూనే ఉంటుంది. ఇక గ్లామర్ పరంగా కూడా ఆమె హద్దులు లేకుండా చేస్తుంది. చీర కట్టు లోనే ఇంత అందం ఉందా అని అందరూ ఆశ్చర్య పోయేలా దీప్తి సునైనా తరుచుగా ఇంస్టాగ్రామ్ లో తన బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేస్తూ అందరినీ మెస్మరైజ్ చేస్తోంది.
గతంలో తాను షణ్మక్ జస్వంత్ తో పీకల్లోతు ప్రేమలో మునిగి పోయన సంగతి తెలిసిందే. ఎప్పుడైతే షణ్మక్ సిరి కు హగ్ చేసుకొని ముద్దులు పెట్టాడో గాని అప్పటి నుండి అతనికి బ్రేకప్ చెప్పి విడిగా ఉంటోంది. ప్రస్తుతం అతని వంక కూడా తిరిగి చూడడం లేదు. ప్రస్తుతం పెళ్లి ఆలోచనలు పక్కన పెట్టేసి కెరియర్ మీద దృష్టి పెట్టింది. చాలా రోజులుగా షణ్ముుక్ లేకుండా వీడియోస్ చేస్తూ వస్తోంది. కాని ఒక ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు వీరి ఇద్దరికి పెద్ద మొత్తం లో డబ్బు ఇచ్చి జంటగా వెబ్ సీరీస్ చేసే ఆలోచన లో ఉన్నారని అంటున్నారు. దీనికి వీరు కూడా సుముఖంగా ఉన్నట్లు మీడియాలో వార్తలు వెలువడ్డాయి.