బిగ్ బాస్ షో: ఎలిమినేషన్ రచ్చ రంబోలా..!!

-

తెలుగు బిగ్ బాస్ షో ఇప్పటికే 5 సీజన్స్ పూర్తి చేసుకొని 6 సీజన్ కూడా రన్ అవుతోంది.. ఈ సీజన్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ చాలా మంది ఎలిమినేట్ అయి పోయారు.ఇంకో మూడు వారాల్లో బిగ్ బాస్ సీజన్ 6 ముగియనుంది. ఇంట్లో 8 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో ఐదుగురు మాత్రమే ఫైనల్ కి వెళతారు. మిగిలిన వాళ్ళు ఎలిమినేట్ అవుతారు.

నిన్నటి ఎపిసోడ్ లో ఆరుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. ఇనయా కెప్టెన్ కావడంతో ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశం లేదు. శ్రీహాన్ ని ఎవరూ నామినేట్ చేయలేదు. ఇక మిగిలిన వాళ్ళు శ్రీసత్య, ఫైమా, రోహిత్, రేవంత్, ఆదిరెడ్డి, కీర్తి ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు.ఇప్పుడున్నవారిలో  అందరూ  స్ట్రాంగ్  గానేఉన్నారు.

ఈ ఆరుగురిలో ఒకరు వచ్చే వారం హౌస్ వీడనున్నారు. లాస్ట్ ఎపిసోడ్ లో లాస్ట్ లో వున్న ఫైమా, అలాగే  ఇక చాలా రోజులు గా ఎలిమినేట్ అయ్యే అవకాశం నుండి తప్పించు కుంటున్న శ్రీ సత్య లలో ఇద్దరిలో ఎవరో ఒకరికి ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతారు.కాగా అందరినీ షాక్ చేస్తూ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది, అంటున్నారు. ఇంకొంత మంది శనివారం ఒకరు, ఆదివారం ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version